Home  »  Bollywood News  »  Ranveer singh: రణ్‌వీర్ సింగ్ నా హీరో కాదు.. ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఎమోషనల్ ట్వీట్ 

Updated : Jul 6, 2026

 

'ధురంధర్ పార్ట్ 1 , పార్ట్  2 భాగాలు సృష్టించిన సంచలనం తాలూకు యొక్క ప్రకంపనలని భారతీయ చిత్ర పరిశ్రమ, అభిమానులు, ప్రేక్షకులు చాలా కాలం యాదుంచుకుంటారు. మరి సుమారు మూడువందల  కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రెండు భాగాలు 3,200 కోట్లకి పైగా వసూలు చేసాయంటే మాములు విషయం కాదు కదా!  ఈ రోజు రణవీర్ సింగ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ధురంధర్ సిరీస్ లోని  రణ్‌వీర్ సింగ్ నటనని  అతని అంకితభావాన్ని గుర్తుచేసుకుంటూ ఆదిత్య ధర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్  ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆదిత్య ధర్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేస్తూ, "హ్యాపీ బర్త్‌డే రణ్‌వీర్! కొన్ని సినిమాలు మనతో జీవితాంతం ఉండిపోతాయి, నాకు 'ధురంధర్' ఎప్పటికీ అలాంటి ఒక ప్రత్యేకమైన సినిమాగానే నిలుస్తుంది. కేవలం మనం చెప్పిన కథ వల్ల మాత్రమే కాదు, చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే చూసే భాగ్యం కలిగే ఒక అద్భుతాన్ని నేను నీలో కళ్లారా చూశాను. నువ్వు ఒక అసాధారణమైన నటుడివని నాకు ముందే తెలుసు, కానీ ఈ ప్రయాణం నీలోని కళాకారుడితో, ఆ కళాకారుడి వెనుక ఉన్న ఒక గొప్ప మనిషితో నన్ను ప్రేమలో పడేలా చేసింది.   షూటింగ్ సమయంలో నువ్వు చూపించిన అంకితభావం సాధారణమైనది కాదు. ప్రతి సీన్ కోసం ప్రాణం పెట్టావు.

 ముఖ్యంగా 26/11 సీక్వెన్స్, క్లైమాక్స్ టీ షాప్ సీన్, పఠాన్‌కోట్ మారణహోమం, పంప్ హౌస్ సీన్, కోర్టు ఎక్స్‌టీరియర్ సీన్స్ చేస్తున్నప్పుడు చాలా అరుదైన, అత్యుత్తమ నటనని  చూశాను. ఏ ఒక్క సీన్‌లోనూ నువ్వు ఈజీ ఆప్షన్ తీసుకోలేదు. ప్రతి ఎమోషన్, ప్రతి సైలెన్స్, ప్రతి చూపు పర్ఫెక్ట్‌గా పండాయి. ఆ కన్సిస్టెన్సీ చూస్తుంటే.. సాక్షాత్తూ ఆ సరస్వతీ దేవి తన చేతిని నీ తలపై పెట్టి దీవించిందా? అన్నట్లు అనిపించింది. ఒక దర్శకుడిగా నా కెరీర్ మొత్తం ఇలాంటి క్షణాల కోసమే ఎదురుచూశాను" అని ఆదిత్య ధర్ ప్రశంసల వర్షం కురిపించారు.


Also read: అతను ఓ సైకో, నన్ను సిగరెట్‌తో కాల్చడంతో పాటు పిచ్చిపిచ్చిగా కొట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

'ఈ సుదీర్ఘ ప్రయాణంలో నువ్వు కేవలం నా సినిమా హీరోగానే మిగిలిపోలేదు, నా సొంత బ్రదర్‌గా మారిపోయావు . నా హృదయాన్ని, నా క్రాఫ్ట్‌ను, నాలోని సినిమా పిచ్చిని నమ్మి నిన్ను నా చేతుల్లో పెట్టినందుకు థాంక్యూ బ్రదర్. మనం కలిసి సృష్టించిన ధురంధర్ ని   చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. లవ్ యూ ఆల్వేస్" అంటూ చెప్పుకొచ్చాడు. అభిమానులు కూడా రణ్‌వీర్ సింగ్‌కి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆదిత్య ధర్ చేసిన  పోస్ట్‌ని షేర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఓటిటిలోను రికార్డులు సృష్టిస్తున్న ధురంధర్ 2   ఈ నెల 10న జపాన్‌లో సైతం భారీ స్థాయిలో విడుదలకి  సిద్ధమవుతోంది.

ranveersingh #dhurandhar #dhurandhar2 #adityadhar






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.